Читать книгу ముఖ మొటిమల చికిత్స - Owen Jones - Страница 5

Оглавление

1 మొటిమలకు మూలికా నివారణలు

మొటిమల సమస్య ఏమిటంటే, దాన్ని ఆపడానికి మీరు పెద్దగా ఏమీ చేయలేరు, ఎందుకంటే చాలా తరచుగా ఇది మీరు పెద్దయ్యాక మీ శరీరంలోని హార్మోన్ల మార్పులకు జరిగే ప్రతిచర్య. ఇలా చెప్పిన తరువాత కూడా, మీకు ఈ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని ఇతర భాగాలలో మీకు చాలా సూచనలు దొరుకుతాయి, కాని ఇక్కడ మొటిమలకు మూలికా నివారణల గురించి నేను చర్చించాలనుకుంటున్నాను.

చాలా మంది ప్రజలు తాజా రసాయన చికిత్సలను కొనడానికి మరియు వాటి కోసం చాలా డబ్బు ఖర్చు చేయడానికి ఫార్మసీకి వెళతారు, కాని నిజంగా, వారు ఆరోగ్య దుకాణానికి లేదా కూరగాయలమ్మే వాళ్ళదగ్గరికి వెళ్లాలి ఎందుకంటే మొటిమలకు మూలికా నివారణలు పుష్కలంగా ఉన్నాయి, దానితోపాటు నయంచేసే మందులు తాజా పండ్లు మరియు కూరగాయల నుండి తయారు చేస్తారు.

మొదటిగా, మొటిమలు అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి: ఇది సెబమ్ ఆయిల్ నాళాలు పూడిపోయి, తరువాత అవి బ్యాక్టీరియా బారిన పడతాయి. కాబట్టి, మొటిమలు రాకుండా మీరు ఆపలేనప్పుడు, మీరు అదనంగా చేరిన నూనెను తీసివేసి, మీ చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువ కాలం జీవించకుండా చేయగలగాలి.

మొదట మీరు ఆరోగ్యకరమైన తాజా పండ్లు మరియు కూరగాయలను తినడం ద్వారా మీ శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడానికి ప్రయత్నించాలి మరియు మీ జీవితంలో దీనికోసం కొవ్వులు మరియు నూనెలు అలాగే వాటిని కలిగి ఉన్న ఏదైనా తినడం తగ్గించాలి. ఈ నూనెలను శరీరం నుండి బయటకు తీసే ప్రయత్నంలో మీరు పుష్కలంగా నీరు త్రాగాలి. గ్రీన్ టీ కూడా తాగితే మంచిది.

టీ ట్రీ ఆయిల్ మరియు లావెండర్ ఆయిల్ సహజంగా క్రిమినాశక మందులు మరియు అవి నూనెలే అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. అవి వేర్వేరు గాఢతలలో దొరుకుతాయి మరియు పీచుపండు నూనె వంటి తటస్థ నూనెలతో వాటిని పల్చగా చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీరు వాటిని కొన్నప్పుడు ఆరోగ్య దుకాణంలో సలహా అడగండి. పురిపిడి కాయలకు కూడా వీటిని ఉపయోగించవచ్చు.

కలబంద అనేది ఒక మొక్క, దీన్ని ప్రభావిత ప్రాంతంపై నేరుగా మీకు నచ్చినంత తరచుగా రుద్దవచ్చు. ఇది చాలా చల్లగా హాయిగా అనిపించేలా చేస్తుంది. మందపాటి ఆకును త్రుంచి, దాని పైనున్న చర్మం కొంచెం తొలగించి, లోపల ఉన్న జెల్లీని మీ చర్మంపై రుద్దండి. మీరు తాజా కలబందను ఒక్కసారి ఉపయోగించారంటే, తర్వాత ఎప్పుడూ షాపులో కొన్న కలబందను ఉపయోగించాలని మీరు ఆశపడరు.

నిమ్మరసం ఒక క్రిమినాశకి మరియు చాలా హాయినిస్తుంది. ఒక నిమ్మకాయ నుండి రసం పిండి, ఆ రసాన్ని మెత్తని బట్టపై పోసి, ఆ బట్టతో మీ ముఖాన్ని తుడవాలి. నిమ్మరసం మొటిమల బ్యాక్టీరియాను చంపడమే కాదు, అదనపు నూనెను కూడా తొలగిస్తుంది. సాధారణ వెనిగర్ కూడా ఇలాగే పనిచేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు విచ్ హాజెల్ రెండూ కూడా మలినాలను శుభ్రపర్చే పదార్థాలే, దుకాణంలో కొన్న నివారణ మందుల కంటే చౌకైనవి మరియు మంచివి. మళ్ళీ, ఈ వస్తువుల గాఢతలను (సాంద్రతలను) బట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటిని, ముఖ్యంగా పెరాక్సైడ్ ను బహుశా పల్చగా చేయాల్సి రావచ్చు.

మొటిమలకు ఇంకా అనేక గృహ నివారణోపాయాలు ఉన్నాయి, వీటిలో చాలా వరకు ఖరీదైన రసాయనాల మాదిరిగానే పనిచేస్తాయి, సమస్య నిజంగా ఏమిటో గుర్తుంచుకోండి (నూనె మరియు బ్యాక్టీరియా) మరియు వాటికి చికిత్స చేసే మార్గాల కోసం చూడండి. రోజ్మేరీని వేడి నీటిలో వేసి, చల్లబర్చి వాడితే కూడా వెల్లుల్లి వలె క్రిమినాశక మందుగా పనిచేస్తుంది, అయినప్పటికీ మీరు దానిని ఇష్టపడకపోవచ్చు.

మొటిమల చికిత్స కోసం మీ మూలికా నివారణలలో భాగంగా ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలనుకుంటే, మీ ముఖం మీద కొంచెం తేనెను రాసి, మీకు నచ్చినంతసేపు అలాగే వుంచి, వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో కడగండి.

ముఖ మొటిమల చికిత్స

Подняться наверх