Читать книгу ముఖ మొటిమల చికిత్స - Owen Jones - Страница 6
Оглавление1 కౌమారదశలో మొటిమలు
ముఖ మొటిమలు టీనేజర్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య - ఇది కేవలం యునైటెడ్ స్టేట్స్ లోనే 17 మిలియన్లకు పైగా టీనేజర్లను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఇది ఒక వైద్య పరిస్థితి కాబట్టి, మొటిమలను నియంత్రించవచ్చు - ఇది అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకుల హృదయాలను ఇది విచ్ఛిన్నం చేస్తుంది. అందువల్ల ఇది శారీరకంగా కంటే భావోద్వేగ సమస్యగా మారింది. ఏమైనప్పటికీ, మొటిమలతో చనిపోవడం అనేది అసలు జరుగదు, అయినప్పటికీ దాదాపు ప్రతి యువకుడు మొత్తం సమయం దీనితోనే గడుపుతూ ఉన్నాడు.
సాంకేతికంగా, మొటిమలు అనేవి సేబాషియస్ గ్రంథులు మరియు వెంట్రుకల కుదుళ్ళు నూనెతో నిండిపోవడం వల్ల ఏర్పడతాయి, ఇది పురిపిటి కాయలు మరియు పొక్కుల్లా బయటకు రావడానికి దారితీస్తుంది. పురిపిటి కాయలు మొటిమలు కానప్పటికీ అవి ఒకే కారణం వల్ల ఏర్పడవచ్చు. మొటిమలు యుక్తవయస్సు రావడంతో పాటు వస్తాయి, అయితే ఎక్కువ కాలం కొనసాగవచ్చు లేదా యుక్తవయస్సు అయిపోయిన తర్వాత కూడా అవి ఆరంభం కావచ్చు.
సేబాషియస్ గ్రంథులు మూసుకుపోయేలా చేసే నూనెను సెబమ్ అని పిలుస్తారు, ఇది చర్మం గుండా పైకి లేచి సాధారణంగా చెమటలాగా చర్మంపైకి వస్తుంది, కానీ అది మూసుకుపోవడం కారణంగా బయటకు రాకపోతే, ప్రొపియోనిబాక్టీరియం అనే మొటిమల బ్యాక్టీరియా పెరుగుతుంది, ఒత్తిడి పెరిగి, చివరకు ఆ ఒత్తిడి కారణంగా అవి పగిలిపోయే వరకు చర్మంపై వాల్కనో లాగా నూనె బయటకు ఉబికి వస్తుంది.
ఒక విషయం ఖచ్చితం, మీరు ఎప్పుడూ మొటిమల ‘పురిపిటి కాయను‘ పిండకూడదు, లేకుంటే మీరు మొటిమల మచ్చలకు కారకులౌతారు మరియు అవి వికారమైనవిగా వుంటాయి అలాగే వాటిని తొలగించడం కష్టం. వాస్తవానికి, మొటిమల మచ్చ చికిత్సలో తరచుగా వికారమైన మచ్చలను తొలగించడానికి శస్త్రచికిత్స లేదా చర్మవ్యాధి నిపుణుడిని సందర్శించడం అవసరమౌతుంది.
ఈ సెబమ్ ఆయిల్ మీ చర్మం యొక్క ఉపరితలంపైకి ఎందుకు రావడంలేదని మరియు సమస్యలను కలిగించకుండా స్వేచ్ఛగా ప్రవహించడం లేదని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే, సాధారణంగా చనిపోయిన చర్మ కణాల ఫలితంగా ఇది జరుగుతుంది, కానీ దీని అర్థం బాధితుడు సరిగా శుభ్రం చేసుకోవడం లేదని కాదు. నిజానికి, ఎక్కువగా కడగడం తీవ్రమైన మొటిమలకు కారణం కావచ్చు.
ఏదేమైనా, సెబమ్ మొత్తం అడ్డుపడటం వల్ల మొటిమలు, పాక్షికంగా అడ్డుపడడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి, ఇవి పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అడ్డుపడడం తీవ్రంగా వుంటే పెద్దవారిలో వైట్‌హెడ్స్ కూడా ఏర్పడతాయి.
ఇంకొక స్థాయి సమస్య ఉంది: కౌమారదశలో ఉన్నవారి చర్మంలో సెబమ్ అడ్డుపడడం ఉపరితలం దగ్గర ఉంటుంది, దీని ఫలితంగా చిన్నగా, సూదిగా వున్న ‘మొటిమలు’ వస్తాయి, లేదా ఇవి పైకి రాకుండా, పెద్ద గడ్డలుగా వస్తాయి, ఇవి సాధారణంగా ఎక్కువ బాధాకరంగా ఉంటాయి ఎందుకంటే ‘వాల్కనో‘ లాగా పేలడానికి చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి.
కౌమారదశలో లేదా యుక్తవయస్సులో మొటిమలు శరీరంలోని ఏ భాగంలోనైనా ఏర్పడతాయి, అయితే ఇవి ముఖం, ఛాతీ మరియు వీపు భాగంలో సర్వసాధారణంగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ సేబాషియస్ గ్రంథులు ఉంటాయి. లైంగిక పరిపక్వతకు ఎదుగుతుండగా, ఈ సర్వవ్యాప్త సమస్యతో బాలురు, అలాగే బాలికలు ఒకేరీతిలో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, అమ్మాయిలకు పొడవాటి జుట్టు వుంటుంది కాబట్టి, వారికే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు.
మొటిమలను పూర్తిగా నివారించడం అసాధ్యం, ఎందుకంటే ఇవి అంతర్గత హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి, కానీ మీరు మొటిమలతో బాధపడుతుంటే, నూనే మీ శత్రువు. మీ స్వంత శరీరంలోని నూనె. అందువల్ల, కౌమారదశలో మొటిమలకు చికిత్స చేయించుకొనేటప్పుడు, మీ జుట్టు శుభ్రంగా కనిపించినప్పటికీ దాన్ని మీ ముఖం నుండి దూరంగా ఉంచండి. మీ దిండును తరచుగా మార్చుకోండి. నిజంగా తరచుగా, మీకు వీలైతే ప్రతి రోజూ మార్చండి.
మీ ముఖాన్ని రోజుకు మూడు లేదా నాలుగుకంటే ఎక్కువసార్లు కడగకండి మరియు రోజుకు ఒకసారి ఆల్కహాల్ ఆధారిత క్లీనర్ ఉపయోగించండి. మేకప్ ఉపయోగించవద్దు మరియు మీ చేతులతో మీ ముఖాన్ని తాకకండి ఎందుకంటే అవి సహజంగా చాలా జిడ్డుగా ఉంటాయి.