Читать книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard - Страница 11

రుచికరమైన ఆలోచన #5: తక్కువ చక్కెరగల బీఫ్ ఎక్స్ప్లోజన్

Оглавление

ఎంతమందికి వడ్డించవచ్చు: 4

వండడానికి పట్టే సమయం: ఒక గంట

కేలరీలు: 331

కొవ్వులు: 26.7 గ్రా

ప్రోటీన్లు: 18.7 గ్రా

పిండి పదార్థాలు: 2.1 గ్రా

మీకు కావలసిన పదార్థాలు:

 వెల్లుల్లి ( రెమ్మలు, రెండు, తరిగినవి)

 తురిమిన కొబ్బరి (55 గ్రా)

 ఉల్లిపాయలు (పచ్చివి, మూడు)

 కొబ్బరి నూనె ( 45 గ్రా)

 అల్లం (10 గ్రా, తురిమినది)

 స్టీక్ (పల్చని ఐరన్ స్టీక్, 455 గ్రా)

తయారు చేయు విధానం:

1 మొదట, పొడవైన, సన్నని ముక్కలుగా కట్ చేయడం ద్వారా స్టీక్‌ను సిద్ధం చేసుకోండి. పూర్తయిన తర్వాత, పెద్ద ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచండి, తద్వారా మీరు అల్లం, కొబ్బరి తురుము మరియు వెల్లుల్లిని జోడించవచ్చు. అప్పుడు, ఫ్రీడ్జ్ లో ఉంచండి, ఆవిధంగా దీన్ని ఒక గంట సమయం వరకు మేరినేట్ చేయండి.

2 ఆ తర్వాత, వేడి చేయడానికి పాన్ లేదా స్కిల్లెట్ ఉంచండి. మాంసానికి నూనె జోడించండి. ఉడికే వరకు మూడు నుండి నాలుగు నిమిషాలు వేడి చేయండి. అప్పుడు, దాన్ని స్టీక్లో కలిపి టాస్ చేసి, పూర్తిగా ఉడికినంత వరకు వేచిఉండండి. దీనికి ఐదు నుండి ఏడు నిమిషాలు పడుతుంది.

3 తరువాత, రుచికి కిక్ ఇవ్వడానికి ఉల్లిపాయలు (ఆకుపచ్చ) జోడించండి. మీకు నచ్చిన ఆకృతి వచ్చేవరకు దానంతటిని ఒకటి లేదా రెండు నిమిషాలు అలాగే ఉంచండి.

4 చివరగా, ఫ్రీజర్ బ్యాగ్ నుండి కొంత మేరినేడ్ తీసుకొని మంటను ఆపడానికి కొంచెం ముందు కలిపి దించేయండి. ఇది అదనపు కిక్‌ని అందిస్తుంది. గుమ్మడికాయ పాస్తా లేదా తక్కువ కార్బ్ కౌస్కాస్ మీదవేసి సర్వ్ చేయండి.

డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం

Подняться наверх