Читать книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard - Страница 6

2 వ అధ్యాయం : మధుమేహ వ్యాధిగ్రస్తులకు తక్కువ చక్కెర వున్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు

Оглавление


తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థాలు వున్న ఆహారం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక ప్రయోజనాలను పొందుతారు. మంచి విషయం ఏమిటంటే, ప్రయోజనాలను పొందడానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, మీరు ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రయోజనాలను చూడవచ్చు. ఇదే ఈ ఆహారాన్ని ప్రోత్సాహకరమైందిగా చేస్తుంది.

కాబట్టి, తక్కువ చక్కెర వున్న ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఆశించే ఐదు ప్రయోజనాల జాబితా ఇక్కడ ఉంది.

1 రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం

సహజంగానే, ఇది ఈ ఆహారం యొక్క అత్యంత తక్షణ ప్రయోజనం. ముందే చెప్పినట్లుగా, మీరు పిండి పదార్థాలు మరియు చక్కెర పరిమాణాన్ని తగ్గించినప్పుడు, మీ శరీరం ఇప్పటికే దాని వ్యవస్థలో నిల్వ చేసిన వాటిని ఉపయోగించడం ప్రారంభిస్తుంది. అందువల్ల మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలు కొన్ని రోజుల్లోనే తగ్గిపోవడాన్ని చూడడం ప్రారంభించవచ్చు. కాలక్రమేణా, మీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణీకరించడం ప్రారంభమవుతాయి. కాబట్టి, ఈ ఆహారం, మందులతో పాటు తీసుకుంటున్నపుడు, చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువవుతుంది.

1 బరువు తగ్గడం

మరో ప్రయోజనం ఏమిటంటే బరువు తగ్గడం. శరీరం గ్లూకోజ్‌ను నిల్వ చేసినప్పుడు అది కొవ్వుగా మారుతుంది కాబట్టి, మీ పిండి పదార్థాలు మరియు చక్కెర యొక్క వినియోగం తగ్గడం వల్ల నిల్వచేసిన కొవ్వును శక్తిగా మార్చడానికి మీ శరీరం బలవంతం చేయబడుతుంది. అందువల్ల తక్కువ కార్బ్ డైట్‌లో పాల్గొనేవారు కొన్ని వారాల తర్వాత బరువు తగ్గడం ప్రారంభిస్తారు. ఈ ఫలితం తక్షణమే జరగక పోయినప్పటికీ, ముఖ్యంగా మీరు అధిక బరువుతో ఉంటే, మీరు బరువు తగ్గడం చూస్తారు.

1 పెరిగిన శక్తి స్థాయిలు

డయాబెటిస్‌తో పాటు వచ్చే లక్షణాలలో ఒకటి, శక్తి తక్కువ స్థాయిలో వుండడం. జీవక్రియలో సంభవించే అసమతుల్యత కారణంగా ఇది జరుగుతుంది. జీవక్రియ రక్తప్రవాహంలో పిండి పదార్థాలు మరియు చక్కెర స్థాయిలను కాపాడలేనందువల్ల, అది శక్తిని సమర్థవంతంగా ఉత్పత్తి చేయగల్గినంత స్థాయిలో ఉత్పత్తి చేయదు. ఫలితంగా, తక్కువ శక్తి స్థాయిలు ఉంటాయి. మీరు తప్పనిసరిగా మీ శరీరంలో నిల్వ వున్న కొవ్వును ప్రాసెస్ చేయమని మీ శరీరాన్ని బలవంతం చేసినప్పుడు, మీ జీవక్రియ శక్తిని ఉత్పత్తి చేయడంలో మరింత సమర్థవంతంగా మారుతుంది. అంతిమ ఫలితం శక్తి స్థాయిలలో మార్పు. కాబట్టి, కొన్ని రోజుల తర్వాత మీకు మరింత శక్తివంతంగా వున్నట్లు అనిపిస్తే ఆశ్చర్యపోకండి.

1 హార్మోన్ల నియంత్రణ

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు హార్మోన్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఉదాహరణకు, ఇన్సులిన్ స్టాకులో లేకుండా పోయే మొట్టమొదటి హార్మోన్. అయినప్పటికీ, కార్టిసాల్ (ఇది బరువు పెరుగుటతో సంబంధం కలిగి ఉంటుంది) లేదా ఎపినెఫ్రిన్ (రక్తంలో పోషకాలను విచ్ఛిన్నం చేయడానికి మరియు విడుదల చేయడానికి ఉపయోగిస్తారు) వంటి ఇతర హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఈ హార్మోన్లు అసమర్థంగా పనిచేస్తాయి. తత్ఫలితంగా, మీరు తినే ఆహారాలతో ఎక్కువ పోషకాహారం పొందకపోవచ్చు.

1 మెరుగైన అభిజ్ఞా పనితీరు

చక్కెర, సాధారణంగా, మీ శరీరంలో ఇంధనంలా పనిచేస్తుంది. కాబట్టి, మీరు పెద్ద మొత్తంలో చక్కెరను తినేటప్పుడు, ఒక నిర్దిష్ట వ్యవధిలో మీకు సత్వరమే శక్తి లభిస్తుంది. అయినప్పటికీ, చక్కెర చాలా తక్కువ స్థాయిలోవున్న ఇంధనం, ఎందుకంటే మీ మెదడు దాని ద్వారా కాలిపోతుంది. తుది ఫలితం తరువాత జరిగే తీవ్రమైన పతనం. కాలక్రమేణా, మీ మెదడులో “జిడ్డు” పెరుగుతుంది. ఈ జిడ్డు మెదడు యొక్క సామర్థ్యాలను పరిమితం చేస్తుంది. అందుకని, మీరు చక్కెరను కూరగాయల ఆధారిత పిండి పదార్థాలవంటి ఇతర రకాల ఇంధనాలతో భర్తీ చేసినప్పుడు, మీ మెదడు శక్తిని మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది డీజిల్‌ను అన్లీడెడ్ ఇంజిన్‌లో ఉంచడం లాంటిది. ఖచ్చితంగా, కారు నడుస్తుంది, కానీ అది పేలవంగా నడుస్తుంది. అందువల్లనే తక్కువ-చక్కెర వున్న ఆహారం తీసుకున్న వారి నివేదికలో చాలామంది అభిజ్ఞా సామర్ధ్యాలను మెరుగుపరుచుకున్నారు, తద్వారా "బ్రెయిన్ ఫాగ్" అని పిలువబడే మానసికసామర్థ్య లోపానికి సంబధించిన దృగ్విషయాన్ని తగ్గిస్తుంది.

ఈ ప్రయోజనాల దృష్ట్యా, మీరు తక్కువ చక్కెరవున్న ఆహారం విషయంలో తప్పు పట్టలేరు!

3 వ అధ్యాయం: రుచికరమైన వంటకం ఆలోచనలు

డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం

Подняться наверх