Читать книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard - Страница 15
రుచికరమైన ఆలోచన #9: నమ్మశక్యంగాని తక్కువ కార్బ్ వున్న సౌత్ ట్రీట్
Оглавлениеఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4
వండడానికి పట్టే సమయం: 29 నుండి 32 నిమిషాలు
కేలరీలు: 288
కొవ్వులు: 22.3 గ్రా
ప్రోటీన్లు: 18.9 గ్రా
పిండి పదార్థాలు: 2.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
టర్కీకోడి చాతిభాగం (రోస్టు చేసింది, 225 గ్రా, చాప్ చేసింది)
చీజ్ (పర్మేసన్, 75 గ్రా)
చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)
తెల్లని చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)
మీకు కావలసిన పదార్థాలు:
1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.
2 తరువాత, మిక్సింగ్ కంటైనర్ తీసుకొని అన్ని చీజ్లను కలపండి. మీరే దాన్ని కలపొచ్చు లేదా ఎలక్ట్రిక్ మిక్సర్‌ను ఉపయోగించవచ్చు. అప్పుడు, ఒక చెంచా మిక్స్ తీసుకొని బేకింగ్ షీట్ మీద ఒక ముద్దలా ఉంచండి. మీరు కుకీల పిండిని అమర్చినట్లుగా అమర్చండి. ఒక్కొక్క ముద్దకు మధ్య ఒక అంగుళం దూరం ఉండేలా పెట్టండి.
3 షీట్ నింపిన తరువాత, సుమారు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఓవన్ లో వుంచండి. దయచేసి చిప్స్ మాడిపోకుండా చూసుకోండి. అంచులు బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు చిప్స్ బాగా ఉడుకుతాయి. అప్పుడు, వాటిని బయటకు తీసి, చల్లబరచండి.
4 చివరగా, టర్కీకోడి చాటిభాగాన్ని తీసి కట్ చేయండి మరియు తక్కువ-చక్కెర వున్న డిప్ తో చిప్స్ సర్వ్ చేయండి. దీన్ని ఒక స్నేక్ లాగా లేదా ఎంట్రీగా అంటే భోజనానికి ముందు మొదటి వంటకం వలె వడ్డించండి.